Wednesday, 4 November 2026

విశాఖ పూర్ణా మార్కెట్‌లో వ్యాన్‌ బీభత్సం

విశాఖ, (జనంసాక్షి):  జిల్లా కేంద్రంలోని పూర్ణా మార్కెట్‌ ఏవీఎన్‌ కళాశాల సమీపంలో వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. వ్యాన్‌కు బ్రేకులు ఫెయిల్‌ అవడంతో జనాలు మీదకు దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *