Tuesday, 3 November 2026

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా మాడ్యురో

కారకన్‌ ,మార్చి 9 (జనంసాక్షి) :
వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ వారసుడిగా చావెజ్‌ ప్రకటించిన విషయం విదితమే. ఇదిలా ఉంటే మాడ్యురో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిండంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అధ్యక్షుడు మరణిస్తే జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాలని, రాజ్యాంగానికి విరుద్ధంగా మాడ్యురో ప్రమాణ స్వీకారం చేయడం సరికాదన్నారు. దీనిని తాము బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *