శ్రీకాకుళం (జనంసాక్షి) : చిత్తూరు జిల్లాలో గజరాజులు చేస్తున్న పంట విధ్వంసం చల్లారక ముందే మరో జిల్లా రైతులు ఏనుగుల బీభత్సానికి హడలిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలంపై ఏనుగులు పెద్ద సంఖ్యలో దాడి చేశాయి. భారీ సంఖ్యలో గజరాజులు తమ గ్రామాల్లో సంచరించడాన్ని చూసి గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.




