Wednesday, 4 November 2026

శ్రీకాకుళం జిల్లాలో వ్యాన్ బోల్తా:12మందికి గాయాలు…

శ్రీకాకుళం: పెళ్లి బ్యాండు బృందంతో వెళుతున్న ఓ వ్యాను బోల్తా పడడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని టీబీ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఒక పెళ్లికి బ్యాండ్ వాయించి మరొక పెళ్లికి హాజరయ్యేందుకు వ్యానులో వెళుతుండగా… డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పది మంది బ్యాండ్ బృంద సభ్యులు సహా 12 మంది గాయపడగా వారిని పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని ప్రాథమికంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *