Thursday, 5 November 2026

శ్రీకాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహూత్స‌వం

ముక్కంటి ఆలయానికి పెరిగిన భక్తులు

తిరుపతి,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ప్రముఖ పుణ్యక్షేత్రమైన  శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివరాత్రి బ్ర¬త్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాలపై పుర వీధుల్లో ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవకు ముందు భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తకన్నప్ప, విఫేబ్నిశ్వరుడు, కుమారస్వామి… స్వామి, అమ్మవార్లకు స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మహాశివరాత్రి బ్ర¬్మత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తికి భక్తులుచేరుకుంటున్నారు. ఈ మేరకుప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా ముక్కంటిని దర్శించుకునేందుకు వేలాదిగ భక్తులు తరలివస్తున్నారు. సోమవారం కూడా స్వామికి ప్రతిపాత్రం కావడంతో ఇక్కడి భక్తుల రాక ప్రారంభమయ్యింది. ఇదిలావుంటే భక్తులకు అన్నప్రసాదాల తయారీకి అవసరమైన కూరగాయలను కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన టి.రామన్న అండ్‌ సన్స్‌ వారు వితరణగా ఇచ్చారు. గతంలో ఒకసారి కూరగాయలు అందించిన వారు.. మహాశివరాత్రి రోజున పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం మరోసారి అందజేశారు. వీరికి ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక  ఆలయాలకు ఏటా పరదాలు వితరణగా అందించడం తిరుపతిలోని వాసుటైలర్స్‌ నిర్వాహకుల ఆనవాయితీ. మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలను పురస్కరించుకుని..మధ్యన త్రిశూలం, రెండు వైపులా విబూది రేఖలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూపొందించిన రెండు పరదాలను ఆలయానికి అందజేశారు. అమ్మవారి వజ్రకిరీటం నమూనాతో తీర్చిదిద్దిన మరో పదరాను అమ్మవారి ఆలయానికి

కానుకగా అందించారు. ఇదిలావుంటే  శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీఅనంతాళ్వారు 961వ అవతారోత్సవం ఈనెల 22న నిర్వహించనున్నట్లు తితిదే  తెలిపింది. అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురుశైవారి తోటలో అత్యంత ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి అనంతాళ్వారు తోటకు వేంచేసి పూజలు అందుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *