Wednesday, 4 November 2026

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి రఘవీరారెడ్డి

మడకశిర: రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ఎన్‌ రఘవీరారెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిర నియోజక వర్గంలోని తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో కుటుంబసభ్యులతో కలసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భార్య సునీతా రఘువీర్‌, కుమారుడు అమిత్‌ రఘువీర్‌, కుమార్తె అమృతా రఘవీర్‌, అల్లుడు వియ్యంకుడితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పాదుకలను తలపై మోస్తూ ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్యెల్యే కె.సుధాకర్‌ , ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *