తిరుమల: మంత్రులు శైలజానాధ్, పార్థసారధి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అలయానికి చేరుకున్న మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అలయ అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.




