Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ రోహిణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న రోహిణికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి అలయ అధికారులు తీర్ధప్రసాదాలను అందజేశారు. జస్టిన్‌ రోహిణితో పాటు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ రవిబాబు స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *