Thursday, 5 November 2026

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-ద ర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలు.
సుదర్శనం : నవంబర్‌ 3, 4, 29, 30, డిసెంబర్‌ 1 నుంచి 15 (3, 4 తేదీలు మినహా) వరకు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్‌ 16వ తేదీకి శనివారం జారీ చేస్తారు.
కాటేజి : డిసెంబర్‌ 16వ తేదీకి శనివారం జారీ చేస్తారు.
ప్రత్యేక దర్శనం : అక్టోబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 15వ తేదీ వరకు (నవంబర్‌ 11, 14, 17, 18 తేదీలు మినహా) అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్‌ 16వ తేదీకి శనివారం జారీ చేస్తారు.
ఆర్జిత సేవలు : డిసెంబర్‌ 16వ తేదీకి శనివారం జారీ చేస్తారు.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనం, సేవ, కాటేజీలు, రూ.300ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 60రోజుల ముందుగా పొందవచ్చు. రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ప్రతి సోమవారం విశేషపూజలు, బుధవారం అష్టదళపూజ, శుక్రవారం నిజపాద దర్శనం, ప్రతిరోజు సుప్రభాతం, కల్యాణోత్సవం సేవలు జరుగుతాయి. రూ.50, రూ. 300ల దర్శనం టిక్కెట్టుకు అదనంగా రూ.50చెల్లిస్తే ఉచితంగా ఇచ్చే రెండు లడ్డూలతోపాటు ఒక్కో టిక్కెట్టుకు రెండు లడ్డూ టోకెన్లు పొందవచ్చు. ప్రతిగురువారం రూ.50 సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేయబడవు. కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒక వ్యక్తి అందరి ఆధార్‌కార్డులతో కేంద్రానికి వస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఆరుటిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు.
ఈదర్శన్‌ కౌంటర్‌ పనిచేయు వేళలు : సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5వరకు పనిచేస్తుంది. శని, ఆదివారాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు. ప్రతి మంగళవారం శెలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *