Wednesday, 4 November 2026

షార్‌ రాకెట్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం…ఇద్దరికి గాయాలు

నెల్లూరు, ఆగస్టు 13 : జిల్లాలో షార్‌ అంతరిక్ష కేంద్రంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేంద్రంలోని స్ర్కాబ్‌ విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కాంట్రాక్టు ఉద్యోగి రాజేష్‌, టెక్నిషియన్‌ చినకొండయ్యకు గాయాలయ్యాయి. రాజేష్‌ అల్యూమినియం పౌడర్‌ను క్లీన్‌ చేస్తున్న సమయంలో స్పార్క్‌రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న చినకొండయ్య పైనుంచి దూకేయడంతో అతని చేయి విరిగింది.
వెంటనే అప్రమత్తమైన షార్‌ అగ్నిమాపకసిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయడిన వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వారిని చెన్నైకి తరలించనున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కోట్లలో నష్ట వాటిల్లినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *