విశాఖపట్నం, జనంసాక్షి: సింహాచలం అప్పన్న గోశాలలో గత పది రోజులుగా 150 లేగదూడలు మృతి చెందాయి. గత రెండు రోజుల్లో 20 దూడలు మృతి చెందాయి. భక్తులు స్వామివారికి ఈ దూడలను సమర్పిస్తుంటారు. ఈ దూడలు కూడా అలా సమర్పించినవే . దూడల సంరక్షణ విషయంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై హిందూ దార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.




