Tuesday, 3 November 2026

సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సేవ

విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారికి రెండో విడత చందనాన్ని 3 మడుగుల సమర్పించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని సుప్రభాత సేవతో మెల్కొల్పి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం సుమారు 130 కేజీల చందనాన్ని అప్పన్నకు సమర్పించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామీణ భక్తులతో పాటు జాలర్లు వేలాదిగా తరలివచ్చారు. వరాహ పుష్కరణికి చేరుకుని స్నానాలు చేసి వంటలు వండుకున్నారు. సింహాద్రి అప్పన్నకు నైవేద్యం పెట్టి భక్తులందరూ భోజనాలు చేశారు. అనంరతం మెట్ల ద్వారా కాలినడకన చేరుకుని సింహాద్రి నాధునిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *