Thursday, 5 November 2026

సిఎం నిర్ణయం అభినందనీయం

ఒంగోలు,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పదో వేతన సవరణలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రివర్గానికి ఆంధప్రదేశ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. ఎలాంటి చర్చలకు ఆస్కారం లేకుండా ఒక్కమాటలో సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం అభిమతానికి కట్టుబడి ప్రతి ఒక్కరు అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఐకాసా ప్రభుత్వ ఉద్యోగుల 20 రకాల డిమాండ్లలో ఆర్థికేతర అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ఉప సంఘంతో చర్చించి వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.అధికారులు, ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *