గుంటూరు, జనంసాక్షి: గుంటూరులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పోలీసులు గురువారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలు, రైతులపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. మహిళలను సైతం సభా ప్రాంగణం నుంచి ఈడ్చుకు వెళ్లారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సాక్షిగా మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ సంఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని వారు ధ్వజమెత్తారు.




