Tuesday, 3 November 2026

సెంట్రల్‌ బ్యాంక్‌ మేనేజరు హత్య

విశాఖ, మార్చి 25 : తూర్పుగోదావరి జిల్లా తేటగుంట దగ్గర సెంట్రల్‌బ్యాంకు మేనేజరు ఆంజనేయులును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. విశాఖ అడ్డరోడ్డులో ఉన్న సెంట్రల్‌ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న ఆంజనేయులును దుండుగులు హత్య చేసిన అనంతరం, మృతదేహానికి సెక్యూరిటీ డ్రెస్‌ వేసి తేటగుంట దగ్గర రోడ్డుపై పడేశారు. ఈ సంఘటనపై పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *