గుంటూరు, జనంసాక్షి: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీన్ స్టడీస్ ఆధ్వర్యంలో సైబర్‌హ్యాకింగ్ పరిణామాలపై సదస్సు నిర్వహించారు. అంతర్జాలం దుర్వినియోగం చేయడం వల్ల కలిగే అనర్థాలపై చర్చించారు. 18 దేశాలో విద్య అభ్యసించడం కోసం దీర్ఘ స్వల్పకాలిక ఉపకార వేతనాలు పొందే విధానాలపై సీహెచ్‌ఎన్‌ఎన్ సంస్థ ఛైర్మన్ తులసీ రామచంద్రప్రభు వివరించారు. ఈ విషయమై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ 18 దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు.




