Tuesday, 3 November 2026

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: తూర్పు మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటికి తోడు మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల తెలంగాణలో పలుచోట్ల, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *