హైదరాబాద్, మార్చి 26 : సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ వైసీపీ సభ్యులు స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామని సభ్యులు తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతు తప్పు చేస్తే ఒప్పుకుంటామని,తప్పులు జరిగి ఉంటే బేషరతుగా క్షమాపణ చెబుతామని జగన్ అన్నారు. అయితే విపక్ష సభ్యులు మనస్పూర్తిగా క్షమాపణ చెప్పడం లేదని, స్పీకర్‌ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
స్పీకర్‌కు క్షమాపణ చెప్పిన వైసీపీ సభ్యులు




