రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏటీఎం నగదు పర్యవేక్షకుడి హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ హత్యకేసులో కీలక నిందితుడు సహా 11మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు కూడా ఉన్నట్లు సమాచారం.




