తిరుమల : హరికృష్ణ, చంద్రబాబు నాయుడుల మధ్య విభేదాలు కేవలం మీడియా సృష్టేనని హరికృష్ణ తనయుడు, సినీనటుడు కల్యాణ్‌రామ్ అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిన్న విషయాలను కూడా మీడియాలో పెద్దగా చూపిస్తున్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని అందరి మంచికోరే వ్యక్తినని, చంద్రబాబు వెన్నంటే ఉండి పార్టీ కోసం తనవంతు సహకారాన్ని అందిస్తానన్నారు.




