Tuesday, 3 November 2026

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలకు చిరంజీవి శంకుస్థాపన

కొత్తపల్లి : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం పర్యటించారు. మూలపేటలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను పదవి చేపట్టినప్పటి నుంచి దేశంలో పర్యాటక రంగానికి రూ. 250 కోట్లు కేటాయించామని తెలిపారు. కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట వద్ద సాగరతీరంలో రూ. ఏడున్నర కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎకో పార్కు, రూ,5కోట్లతో నిర్మించనున్న శిల్పారామం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *