Tuesday, 3 November 2026

10న జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

తిరుపతి,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లా ఆంధ్రా క్రికెట్‌ సంఘం  ఆధ్వర్యంలో జిల్లా సీనియర్‌ జట్టు ఎంపిక తిరుపతిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు  తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతి సవిూపంలోని తుమ్మలగుంట క్రీడామైదానంలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. పోటీల నిర్వహణ ఏర్పాట్లు జిల్లా ఛైర్మన్‌ వి.ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతున్నట్లు వివరించారు. జట్టు ఎంపిక సంఘం అధ్యక్షులుగా సీనియర్‌ రంజీ క్రీడాకారుడు వీజేటీ రామ్మోహన్‌, సభ్యులుగా విజయశేఖర్‌, నాగభూషణం వ్యవహరిస్తారన్నారు. ఇందులో పాల్గొనదలచిన వారు క్రికెట్‌ సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *