Tuesday, 3 November 2026

12 ఇసుక ట్రాక్టర్ల పట్టుకున్న సీఐ

చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను వైరా సీఐ మోహన్‌రాజా పట్టుకున్నారు. మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *