ఓర్వకల్లు,(కర్నూలు): నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికుల తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చిరంజీవి, ఆర్డీఓ కురుమనాథ్, తహశీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి సందర్శించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.




