Wednesday, 4 November 2026

16 నుంచి డీఎడ్‌ పరీక్షలు

విజయవాడ,మార్చి9(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా డీఎడ్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు  అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈనెల 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. వాస్తవానికి గత డిసెంబరులో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.  జిల్లాలోని ఒక ప్రభుత్వ, 20 ప్రయివేట్‌ డైట్‌ కళాశాలల్లోని ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 2013-15 విద్యా సంవత్సరంలో కౌన్సెలింగ్‌ ఆలస్యమై 2013 నవంబరు 27న వీరు కళాశాలల్లో చేరారు. విద్యా సంవత్సరంలో పనిదినాలు సరిపోక సెలవుల కాలమైన 2014 మేలో కూడా వీరికి తరగతులు నిర్వహించారు. నవంబరు 2వ తేదీతో ప్రథమ సంవత్సరం పూర్తవగా డిసెంబరు 29 నుంచి 2015 జనవరి 2 వరకూ అయిదు రోజులు పాటు పరీక్షలు నిర్వహిస్తామని ముందుగా ప్రకటించారు. అయితే ప్రయివేట్‌ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో వాయిదా వేశారు. తాజాగా మార్చి 16 నుంచి నిర్వహించాలని డైరెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *