గుంటూరు, మార్చి 15 : బిజెపి సీనియర్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకటయ్యనాయుడు ఈనెల 17వతేదీన గుంటూరుకు విచ్చేస్తారు. ఆరోజు ఉదయం 10గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర వర్తక ప్రముఖులతో ఆయన సమావేశమవుతారు. మోడీ ప్రధాని అయితే పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు ఏమి చేస్తారు? వ్యాపార వర్గాలు ఏమి కోరుకుంటున్నాయో క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించి ఎన్నికలు కార్యచరణలో చేర్చడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పార్టీ వార్గలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బిన్నింగ్, స్పిన్నింగ్, పోగాకు తదితర ఉత్పత్తులను ఎగుమతి చేయనున్న వ్యాపారులతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యలు, ఇతర వ్యాపార వర్గాలకు పరిమితంగా ఆహ్వానించినట్లు తెలిసింది. వర్తకుల సమావేశానికి పార్టీ నాయకులను అనుమతించరు. అనంతరం పార్టీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యేలా అర్బన్, జిల్లాపార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారని పేర్కొన్నారు.




