Wednesday, 4 November 2026

September 2012

జిల్లా వార్తలు

భీజేపీ ఆందోళన

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకరన్తలపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. దీంతో జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంబించింది.

జిల్లా వార్తలు

పరిక్షలు వాయిదా

తాండూరు: ఏపీ హిందీ ప్రచారసభ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8,9,10 తేదిలలో నిర్వాహించాల్సిన హిందీ నాగరీ బోధ్‌, విద్వాన్‌ పరిక్షలను ఈనెల 22,23,24 తేదిలలో నిర్వహించనున్నట్లు మంత్రి అరవింద్‌కుమార్‌షిండే తెలిపారు.

జిల్లా వార్తలు

రౖల్వేస్టేషన్‌ తనిఖీ చేసిన డీఆర్‌ఎం

నిజామాబాద్‌:(బోధన్‌) రైల్వేష్టేషన్‌ను ఈ రోజు రైల్వే డీఆర్‌ఎం రాకేష్‌ ఆరుణ్‌ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సిగ్నలింగ్‌ వ్యవస్థ మౌలిక వసతులపై స్టేషన్‌ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. బోదన్‌-నిజామాబాద్‌ మధ్య రైల్వేలైన్‌ను పరిశీలించటానికి ఆయన మోటరు ట్రాలీపై ప్రయాణించారు. ఈ…

జిల్లా వార్తలు

ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డ్‌

మెదక్‌: చేగుంట మండలంలోని ఇబ్రహింపూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపధ్యాయుడు సరోత్తమరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గత సంవత్సర కాలంలో ఎల్‌ఎస్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉత్తమ సేవలందించినందుకు ఈ అవార్డు లభించింది.

ఖమ్మం

నష్టపరిహారం పెంచాలని సబ్‌కలెక్టర్‌కు వినతి

ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్‌కలెక్టర్‌ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.

కరీంనగర్

వైద్యం చేయించుకునే స్థోమతలేక నేత కార్మికుని మృతి

కరీంనగర్‌: సిరిసిల్లలో స్థానిక సుందరయ్యనగర్‌కు చెందిన నేత కార్మికుడు రాజమౌలి అప్పుల బాధ భరించలేక కిడ్ని అమ్ముకున్నాడు. తద్వారా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాడు. అయితే కొన్ని రోజుల అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య చికిత్సలు చేయించుకునే ఆర్థిక…

కరీంనగర్

మైసమ్మ విగ్రహం ధ్వంసం

కరీంనగర్‌:ఎల్లారెడ్డిపేటలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ఆటో యజమానుల సంఘం ప్రతిష్టించిన మైసమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధంవంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి పడేశారు. యజమానుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

కరీంనగర్

విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించిన రైతులు

కరీంనగర్‌: గంగాధర మండలంలోని 4గ్రామాల్లో రెండు నెలల క్రింద కాలిపోయిన విద్యుత్‌ ట్రాన్స్‌ పార్మర్లకు మరమత్తులు చేపట్టాలని రైతులు గంగాధర విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నాగిరెడ్డిపూర్‌, నర్శింహులపల్లి, మల్లాపూర్‌, ఉప్పరమల్యాల గ్రామంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి…

వార్తలు

రాజ్యసభలో తోపులాట

న్యూఢిల్లీ: ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో గందరగోళం నెలకొంది. సభ్యులు వాగ్వాదానికి దిగి ఒకరినొకరి తోసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించే అంశాన్ని సభలో  సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకించింది. మరోవైపు బిల్లుకు…

వార్తలు

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన కొనసాగుతోంది. ఉదయం ఓసారి వాయిదాపడిన లోక్‌సభ తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ వ్యక్తం…