Tuesday, 3 November 2026

October 2012

హైదరాబాద్

సుద్దాల ఫౌండేషన్‌ ప్రదానం

హైదరాబాద్‌ : గాయకులు, సాంస్కృతిక కళాకారులను ప్రోత్సహించేందుకు సుద్దాల హనుమంతు, జానకమ్మల జాతీయ పురస్కరాలను అందజేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ,సీనీ రచయిత సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. ఈ నెల 10 న రవీంద్రభారతిలో జరిగే కర్యక్రమంలో ముఖ్యఅతిధిగా…

జాతీయం

రాకెట్‌ లాంచర్‌తో మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గడ్‌లోని గోల్లపల్లి పోలిస్‌ స్టేషన్‌పై మావోయిస్టులు రాకెట్‌ లాంచర్‌తో దాడి చేశారు. రాకెట్‌ లాంచర్‌ పోలిసు స్టేషన్‌కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.

కరీంనగర్

ధర్మపురిలో భారీవర్షం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలో మంగళవారం ఉదయం కురిసిన కుండపోత వర్షంతో తిమ్మపూర్‌ గ్రామంలోని ఎస్సీ కాలనీలో 50 ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఆహారపదార్ధాలు ఇతర సామగ్రి తడిచి ముద్దయ్యాయి. చంద్రయ్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది.

కరీంనగర్

సిరిసిల్లలో ఇల్లు కూలి ఇరువురికి తీవ్ర గాయాలు

కరీంనగర్‌: సిరిసిల్లలో ఉదయం నుంచి కురస్తున్న వర్షానికి పత్తిపాక వీధిలోకి కోత్వాల్‌ లక్ష్మవ్వ ఇల్లు కూలి ఇంటిలో ఉన్న భారతవ్వ, లక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని సిరిసిల్ల ప్రాంతీయాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

కొలంబొ: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీల్లో ఈరోజు మొదటి మ్యాచ్‌ ఇంకాసేనట్లో ప్రేమదాస క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

ఎడ్‌సెట్‌ విద్యార్థులకు కళాశాలల కేటాయింపు

విశాఖపట్నం: ఎడ్‌సెట్‌ విద్యార్థులకు ఈ నెల 3న కళాశాలల కేటాయింపు జరపనున్నట్లు ఎడ్‌సట్‌ కన్వీనర్‌ నిమ్మా వెంకట్రావు తెలియజేశారు. రేపు సాయంత్రం ఏడు గంటల తర్వాత వెబ్‌సైట్లో కళాశాలల కేటాయింపు వివరాలు చూసుకోవచ్చని ఆయన తెలిపారు.

జాతీయం

24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు

విశాఖపట్నం : వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెర్కోంది. ఉత్తరకోస్తా తెలంగాణలపై అల్పపీడనం స్థిరంగా కదులుతోందని, ఇది విదర్భవైపు పయనించి క్రమంగా బలహినపడనుందని తుపాను హెచ్చరికల…

కరీంనగర్

పెద్దపల్లిలో ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు

కరీంనగర్‌: పెద్దపల్లిలో మహాత్మగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పార్టీల నాయకులు గాంధీ విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసవీ క్లబ్‌ వనిత సభ్యలు అనాధలకు దుస్తులు పంపిణీ చేశారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో లైన్స్‌క్లబ్‌…

వార్తలు

-తమిళనాడు శాసనసభాపతిగా ధనపాల్‌ నియామకం

చెన్నై : తమిళనాడు శాసనసభ నూతన స్పీకర్‌గా పి. ధనపాల్‌ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఉపసభాపతిగా ఉన్న అయన ఈ నెల 10 న స్పీకర్‌గా ప్రమాణస్పీకారం చేయనున్నారు. ధనపాల్‌ రాశిపురం (ఎన్‌సీ)నియాజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

హైదరాబాద్

ముగిసిన తెలంగాణ జేఏసీ మౌనదీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌ వద్ద చేపట్టిన మౌనదీక్ష ముగిసింది.జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టిన దీక్షకు పలువురు జేఏసీ నేతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30…