Wednesday, 4 November 2026

October 2012

ఆదిలాబాద్

అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 26 : నవంబర్‌ 1న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర…

ఆదిలాబాద్

మావోయిస్టుల డంవ్‌ స్వాధీనం

ఆదిలాబాద్‌: ఉట్నూరు కోచిగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంవ్‌లో 30 డిటోనేటర్లు, 150 మీటర్ల విద్యుత్‌ వైరును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.

జాతీయం

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ రద్దు

ఢిల్లీ: ఈరోజు సాయంత్రం జరగవలసి వున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం రద్దయింది. దాని బదులుగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ముఖాముఖి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పదవుల భర్తీపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

అంతర్జాతీయం

అప్ఘనిస్తాన్‌ బాంబు పేలుడులో 41కి చేరిన మృతుల సంఖ్య

అప్ఘనిస్తాన్‌: మానవబాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాబూల్‌లోని ఒక ప్రార్థన మందిరం వద్ద ఈ రోజు ఉదయం మానవబాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

జిల్లా వార్తలు

30శాతం వృద్ది సాధించిన ఎన్టీపీసీ

  హైదరాబాద్‌: ఎన్టీపీసీ రెండో త్రైమాసికంలో 30శాతం వృద్ది నమోదు చేసింది. ఈ సమయంలో సంస్థ రూ.3,142,35 కోట్ల నికరలాభం అర్జించినట్లు ప్రకటించింది.

హైదరాబాద్

డీజీ హుడాను కలిసిన భాజపా బృందం

హైదరాబాద్‌: పోలీసుల వైఫల్యం వల్లే ముషీరాబాద్‌లో దసరా సందర్భంగా అమ్మవారి గుడిపై ఓ వర్గానికి చెందిన అల్లరి మూక దాడిచేసిందని భాజపా బృందం శాంతిభద్రతల డీజీ హుడాను కలిసింది. అమ్మవారి దేవాలయంపై రాళ్లతో దాడి చేసి చెప్పులు విసిరినా…

జాతీయం

మంత్రి పదవికి ఎస్‌ఎం కృష్ణ రాజీనామా

  ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం.కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన రాజినామా చేసినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీఇ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే రాష్ట్రంలోనూ, రాష్ట్రేతర ప్రాంతాలకు 38ప్రత్యేక రైళ్లను నడుపుతొంది. సికింద్రబాద్‌-తిరుపతి, కరీంనగర్‌-తిరుపతి, సికింద్రబాద్‌-విశాఖపట్నం వయా ఖాజీపేట్‌, సికింద్రబాద్‌-విశాఖపట్నం వయా గుంటూరు, విశాఖ-షిర్డీసాయినగర్‌ వయా కాచిగూడ మార్గల్లో ఈ ప్రత్యేకరైళ్లు…

హైదరాబాద్

ఎంపీ బలరరాంనాయక్‌కు పిలుపు

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌కు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శినుంచి పిలుపు వచ్చింది. అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో కేంద్ర మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నా వార్తల నేపధ్యంలో ఈ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

హైదరాబాద్

ముగిసిన కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ నేతలు సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతో…