Wednesday, 4 November 2026

November 2012

జిల్లా వార్తలు

చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

మహబూబ్‌నగర్‌: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోని వాహనం జడ్చర్ల వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి, ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి వాహనం బోత్తాపడినట్లు సమాచారం.

సీమాంధ్ర

వెంగళరాయసాగర్‌ జలాశయానికి పోటెత్తిన వరద

విజయనగరం: భారీ వర్షాలతో విజయనగం జిల్లాలోని వెంగళరాయసాగర్‌ జలాశయానికి వరద ఉద్థృతి పెరిగింది.ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3460 క్యూసెక్కులు వరద వస్తుండగా.. జలాశయం గేట్లు ఎత్తి 4900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

వార్తలు

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 10 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 3 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

వార్తలు

కేకే రైల్వేలైన్‌ మార్గంలో విరిగిపడిన బండరాళ్లు

విశాఖ: భారీ వర్షాలకు అనంతగిరి మండలంలో కిరండోల్‌-కొత్తవలస రైల్వే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. పునరుద్ధరణకు మూడ్రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. దీంతో రైల్వేకు రోజుకు రూ.25 కోట్ల నష్టం ఉంటుందని చెబుతున్నారు.…

హైదరాబాద్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ శివారాంపల్లిలోని విజయానంద గార్డెన్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురు పేకటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.81 వేలు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్‌: తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షలు పడే అవకాశం ఉంది. తెలంగాణ రాయలసీమలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర…

హైదరాబాద్

నేడు ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌ : నీలం తుపాను వల్ల వరద ముంపునకు గురైన ప్రాంతాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం, బాధితులను పరామర్శించి సహాయకార్యక్రమాలను ముఖ్యమంత్రి పర్యవేక్షించనున్నారు.

వార్తలు

నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

విశాఖ: భారీ వర్షాల కారణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో నేడు, రేపు జరగాల్సిన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ జేఎన్‌టీయు-కే పరిధిలో నేడు జరగాల్సిన అన్నీ పరీక్షలు వాయిదా వేసినట్లు సంబంధిత అధికారులు…

వార్తలు

వరద బాధిత ప్రాంత పాఠశాలలకు సెలవు

శ్రీకాకుళం: భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునగడంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు నేడు సెలవును ప్రకటించారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో వరద ఉద్థృతి తగ్గకపోవడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవును…

వార్తలు

కోనసీమలో 22 పునరావాస కేంద్రాలు

తూర్పుగోదావరి: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన కోనసీమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితుల కోసం 22 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. 5,500 మందిని ఈ  కేంద్రాలకు తరలించారు. కోనసీమలో 1.5 లక్షల ఎకరాల వరి పంట…