Wednesday, 4 November 2026

December 2012

జాతీయం

ఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభంవించింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్థమాయ్యాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలకు అదుపులోకి తీతుకొచ్చారు.

జాతీయం

రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై చర్చ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై లోకసభలో చర్చ జరగడం, అనంతరం నిన్న జరిగిన ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం గెలుపొందిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా, ప్రభుత్వానికి మద్దతుగా…

జాతీయం

ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వం

ఢిల్లీ : రాజ్యసభలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ప్రభుత్వానికి మద్ధతునిచ్చేలా ఓటు వేయబోమని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. నిన్న లోక్‌సభలో ఇదే అంశంపై జరిగిన ఓటింగ్‌లో ఎస్పీ పాల్గొనకుండా వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సీమాంధ్ర

టాటాఏసీ వాహనం బోల్తా : 18 మందికి గాయాలు

వర్చూరు : జిల్లాలోని వర్చూరు-కారంచేడు మధ్య ఈ రోజు ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

భాజపాలో చేరి కాంగ్రెస్‌ సీనియర్‌నేత

గుజరాత్‌ : గుజరాత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నరహరి అమిన్‌ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ  సీనియర్‌ నేతగా, గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అదక్షుడిగా అమిన్‌ ఎంతోకాలం పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు…

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: గురువారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా నష్టంలో, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతొంది.

జాతీయం

సోనియాతో తెలంగాణ ఎంపీల భేటీ

ఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాధీని గురువారం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఎడిట్ పేజీ

ఎంపీలూ.. ఇదే ఊపు కొనసాగించండి

తెలంగాణ సమస్యపై యూపీఏ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేలా ఒత్తిడి తెచ్చి టీ కాంగ్రెస్‌ ఎంపీలు పెద్ద విజయమే సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఆకాంక్షను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు చేయని ప్రయత్నం లేదు.…

జాతీయం

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రెండు రోజులపాటు వాడివేడి చర్చల మధ్య ఈ రోజు సభలో ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల అంశం చర్చనీయాంశమయైంది.

జిల్లా వార్తలు

గుంటూరులో రేషన్‌బియ్యం పట్టివేత

పొన్నూరు : గుంటూరు జిల్లా పొన్నూరులోని ఎంఎస్‌ఆర్‌ రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు ఈరోజు ఉదయం దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా దాచిఉంచిన 70 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపైకేసునమోదు చేశారు.