Tuesday, 3 November 2026

December 2012

జాతీయం

టీ మంత్రులు, ఎంపీలకు కాంగ్రెస్‌ ఆహ్వానం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరుగనున్న దృష్ట్యా కాంగ్రెస్‌ హైకమాండ్‌ బుజ్జగింపు చర్యలకు ప్రారంభించింది. తెలంగాణ ప్రాంత మంత్రులను, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను చర్చలకు రావాలని ఆహ్వానించింది. రేపు హైకంమాండ్‌తో మంత్రులు, ఎంపీలు భేటీ కానున్నారు. హైకమాండ్‌ తరపున…

హైదరాబాద్

‘రేపు ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఓటు’

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో రేపు ఎఫ్‌డీఐలపై జరిగే చర్చలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పాల్గోంటారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా తమ ఇద్దరు ఎంపీలు ఓటు వేస్తారని ఆయన తెలియజేశారు. అందుకే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారని వివరించారు.

హైదరాబాద్

సర్‌ఛార్జీలను పెంచితే ఊరుకోం: హరీష్‌రావు

హైదరాబాద్‌: ప్రభుత్వం మరోసారి సర్‌ఛార్జీలను పెంచితే ఊరుకోమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. ఇవాళ ఆయన ఈఆర్‌సీ కార్యాలయంలో జరిగిన బహిరంగ చర్చలో పాల్గొన్నారు. మరో రూ. 90 కోట్ల సర్‌ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే…

హైదరాబాద్

ఆగిపోయిన ఈఆర్‌సీ విచారణ

హైదరాబాద్‌ : విద్యుత్‌ సర్‌ ఛార్జీల పెంపుపై ఈఆర్‌సీ జరుపుతున్న బహిరంగ విచారణ నిలిచిపోయింది.ఈఆర్‌సీ కార్యాలయంలో విచారణలో పాల్గొన్న హరీష్‌రావు, నారాయణ, దత్తాత్రేయ, జనక్‌ప్రసాద్‌, రాఘవులు, నారాయణ , పీఓడబ్య్లూ సంధ్యలు విచారణ సరిగ్గా జరగడంలేదంటూ ఆందోళనకు దిగారు.…

వార్తలు

గుజరాత్‌ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో రైతులపై వరాల జల్లు కురిపించింది.  తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇవ్వనున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొంది. మార్కెటింగ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ వసతులు…

జాతీయం

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఈ ఉదయం ప్రారంభంగానే మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌, భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపింది. తర్వాత రేపలికి వాయిదా పడింది. ఐకే గుజ్రాల్‌ మరణానికి…

హైదరాబాద్

కరెంట్‌ ఛార్జీల పెంపుపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ

హైదరాబాద్‌: కరెంట్‌ ఛార్జీల పెంపుపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉపనేత హరీష్‌రావు, రాఘవులు, నారాయణ, దత్తాత్రేయలు దీనికి హాజరయ్యారు. సర్‌ ఛార్జీలు ఉపసంహరించాలని టీఆర్‌ఎస్‌, వామపక్షాలు  డిమాండ్‌ చేశాయి. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

కేటీపీపీ ముందు ఎమ్మార్పీఎస్‌ ధర్నా

వరంగల్‌: భూపలపల్లి వద్ద ఉన్న కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాట్‌ ముందు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కోంపల్లి గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. పవర్‌ ప్లాంట్‌ వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంకాగానే సెన్సెక్స్‌ 68 పాయింట్లు, ఎస్‌ఎస్‌ఈ సూచి నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.

హైదరాబాద్

మాజీ మంత్రి మోపిదేవి బెయిల్‌ పిటీషన్‌ కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ను హైకోర్టు కొట్టేసింది. మోపిదేవిని బెయిల్‌పై విడుదల చేస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.