Friday, 6 November 2026

December 2012

జాతీయం

అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి

న్యూఢిల్లీ : యువతిపై సామూహిక అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం జారీచేసింది. బాధితురాలు, ఆమె స్నేహితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కరీంనగర్

కొండా సురేఖ మతి భ్రమించింది : కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌ : తెలంగాణ ఉద్యమంలో కొండా సురేఖ ఒక కలుపుమొక్క అని ఆమెకు మతి భ్రమించిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పాదయాత్రల పేరుతో వైఎస్సార్‌సీపీ తెలంగాణలో రాయలసీమ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తే…

హైదరాబాద్

28న ఢిల్లీలో దీక్ష చేసే యోచన : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు వ్యవహరించాలని ఈ నెల 26న అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు  చేపట్టాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. ఈ ఉదయం ఐకాస స్టీరింగ్‌ కమిటీ భేటీ అయింది. కేంద్రం…

జాతీయం

ఢిల్లీలో గస్తీని ముమ్మరం చేస్తాం : షిండే

న్యూఢిల్లీ: దేశరాజధానిలో జరిగిన కీచక పర్వంపై అన్ని వైపులా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభలో హోంమంత్రి షిండే మాట్లాడారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు…

హైదరాబాద్

23న తెలంగాణ విద్రోహ దినం : జేఏసీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగిసింది. 23న తెలంగాణ విద్రోహదినంగా పాటిస్తామని జేఏసీ తెలిపింది. 26న తెలంగాణ పది జిల్లాల్లోని మండల కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటూతూ దీక్షా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది.…

ఎడిట్ పేజీ

గడ్డాలూ-మీసాలూ

కథలు గుర్తుకువచ్చినప్పుడల్లా మా తాత గుర్తుకొస్తారు. ఆయన వంగిపోయిన నడుము గుర్తుకొస్తుంది. ఆయన ధోతి గుర్తుకొ స్తుంది. ఆయన నులక మంచం గుర్తుకొస్తుంది. ఆయన గడ్డం మీసాలూ గుర్తుకొస్తాయి. చివరికి ఆయన మరణం గుర్తుకొస్తుంది. మా తాతకి ముగ్గురూ…

ఎడిట్ పేజీ

దాడుల సంస్కృతికి మనకెక్కడిది?

రాజకీయాల్లో దాడులు, ప్రతిదాడులు, భౌతికదాడులు, ప్రత్యుర్థులను తుడిచి పెట్టడం లాంటి పదాలు ప్రశాంతమైన తెలంగాణలో ఇంతుకుముందు ఎప్పుడూ విని ఉండం. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ప్రత్యర్థలంటూ శాశ్వతంగా ఉండరు. ఎన్నికల సమయంలో పార్టీల వారీగా వైఖరి చెప్పుకోవడం మినహా…

జాతీయం

కోటా బిల్లుపై లోక్‌సభలో ఆందోళన

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా, ఇతర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో స్పీకర్‌ సభను మధ్యహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నేడు పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది.

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. 90 రోజుల అంశంప అఫిడవిట్లు దాఖలు చేయాలని సీబీఐ, జగన్‌ తరపు న్యాయ వాదులను కోర్టు ఆదేశించింది.

జిల్లా వార్తలు

మెదక్‌ జిల్లాలో లారీని ఢీకొన్న రైలు

మెదక్‌ : జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సంఖాపూర్‌ రైల్వే గేటు వద్ద ప్రమాదం జరిగింది ఇండోర్‌-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును లారీ ఢీ కొంది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్‌ వద్ద కాపల…