Tuesday, 3 November 2026

January 2013

హైదరాబాద్

డీఎస్సీ సమస్యను తక్షణం పరిష్కరించాలి :మంత్రిని కోరిన తెలంగాణ ఐకాస నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి పార్థసారధిని సచివాలయంలో కలిశారు. 2012 డీఎస్సీ అభ్యర్థుల సమస్యను తక్షణం పరిష్కరించాలని మంత్రిని కోరారు. 2012 డీఎస్సీ నియామకాల్లో తొలి జాబితాను పక్కనపెట్టి రెండో…

హైదరాబాద్

ముఖ్యమంత్రి, జగ్గారెడ్డిలపై తెలంగాణ న్యాయవాదుల ఫిర్యాదు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలపై తెలంగాణ ప్రాంత న్యాయవాదులు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

హైదరాబాద్

కోర్టుకు హాజరైన ఉమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌: ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను న్యాయస్ధానం ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం సాయంత్రం

సంగారెడ్డి : ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సంగారెడ్డి కోర్టులో బుధవారం వాదనలు పూర్తియ్యాయి. అక్బర్‌ తరపు న్యాయవాది రఘు నందన్‌ తన వాదనలను న్యాయమూర్తి మారుతీదేవి ఎదుట విన్పించారు. న్యాయమూర్తి తీర్పును సాయంత్రానికి వాయిదా వేశారు.

హైదరాబాద్

నాటకాలు కట్టిపెట్టి సోనియా ఇంటి ముందు ధర్నా చేయండి : ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆ హామిని మరిచిపోయిందని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు నాటకాలు కట్టిపెట్టి సోనియాగాంధీ నివాసం ముందు ధర్నా చేయాలని ఆయన సూచించారు.…

జాతీయం

రాజీనామాలు సమర్పించేందుకే ఢిల్లీకి వచ్చాం

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో వెనకుడుగు వేసేది లేదని ఢిల్లీకి వచ్చిన ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. అధినేత్రికి రాజీనామాలు సమర్పించేందుకే దేశరాజధానికి వచ్చినట్లు వారు తెలిపారు. వయలార్‌ రవి పిలిస్తే…

సీమాంధ్ర

హిందూపురంలో అగ్ని ప్రమాదం

అనంతపురం : హిందూపురం వక్కల బజారులోని ఓ దుకాణంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై…

హైదరాబాద్

గాంధీకి ఘన నివాళి

హైదరాబాద్‌: మహాత్మగాంధీ 65వ వర్థంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌ వద్ద గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, మంత్రులు గీతారెడ్డి, దానం  తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన సర్వమత…

జిల్లా వార్తలు

కేటీపీపీలో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి

వరంగల్‌ : ఘన్‌పూర్‌ మండలం చెల్పూర్‌ కేటీపీపీలో బాయిలర్‌ ట్యూబ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే నిపుణులు రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్‌ పునరుద్ధరణకు రెండ్రోజులు పట్టే…

జాతీయం

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగీ లాభపడింది. నిఫ్టీ 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.