దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి, పలువురి అరెస్టు
హైదరాబాద్: శంకరరావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు దళిత సంఘాల నేతలను అరెస్టు చేశారు.
హైదరాబాద్: శంకరరావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు దళిత సంఘాల నేతలను అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఐటీ కంపెనీలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని డిస్కంలను సీఎం ఆదేశించినట్లు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సచివాలయంలో ఐటీ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. అనంతరం పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. సీఎంకు మానవత్వం ఉంటే శంకర్రావు అరెస్టు చేసిన తీరును చూసి స్పందించాలన్నారు. పోలీసుల ప్రవర్తనపై సీఎం సమాధానం చెప్పాలని మందా డిమాండ్ చేశారు. శంకర్రావు అరెస్టు…
హైదరాబాద్: శంకరరావు వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మల్కాజ్‌గిరి డీసీపీ పాల్గొన్నారు.
జీజింగ్ : చైనాలోని సన్‌మాన్‌గ్జియాలో మందుగుండు సామాగ్రితో వెళ్తున్న వాహనం పేలింది. ఈ ప్రమాదంలో 26 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.సన్‌మాన్‌గ్జియాలో ఉన్న బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి బ్రిడ్జి దెబ్బతింది.…
హైదరాబాద్: నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,690లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,900లుగా ఉంది. కిలో…
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్‌రావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని జేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. పదవులకు విలువ ఇవ్వకున్నా పోలీసులు శంకర్‌రావు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. శంకర్‌రావు అరెస్టుకు ప్రోత్సహించిన…
వరంగల్ రాయపర్తి మండలంలోని మురిపిరాల భాగ్యలక్ష్మి పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం తెలిసింది.
ముంబయి : భారతీ ఎయిర్‌టెల్ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 72 శాతం తగ్గి రూ. 284 కోట్లకు చేరింది. 2011 డిసెంబర్‌లో సంస్థ నికరలాభం రూ.1,011 కోట్లుగా ఉంది.
హైదరాబాద్: బెయిల్ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇందుకోసం ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జనర్దాన్‌రెడ్డిని నాంపల్లి కోర్టుకు తరలించారు.