Monday, 2 November 2026

February 2013

జాతీయం

షిండేతో ఎంపీ వివేక్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దపల్లి ఎంపీ వివేక్‌ భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన షిండేకు వివరించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం…

హైదరాబాద్

శంకర్‌రావుకు ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నాం : వైద్యులు

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్‌రావు ఒత్తిడి వల్ల హైబీపీకి గురయ్యారని కేర్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐసీయూలోనే ఆయనకు చికిత్సను కొనసాగిస్తున్నామని  చెప్పారు. బైపాస్‌ సర్జరీ అయినందువల్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారం కేసులో…

వార్తలు

చైనాలో బాణాసంచాతో వెళ్తున్న ట్రక్‌లో పేలుడు : 26 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని హెనాన్‌ ప్రాంతంలోని జాతీయ రహదారిపై బాణాసంచాతో వెళ్తున్న ఓ ట్రక్‌లో ప్రమాదం చోటుచేసుకొని పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సాన్‌మెంగ్జియా జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఈ…

జిల్లా వార్తలు

తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధం : ఎర్రబెల్లి

వరంగల్‌ : సహకార ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధంగా ఉందని  ఆపార్టీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుండటం వల్లే తెరాసకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన…

జాతీయం

పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంథీ అంతర్జాతీయ విమానాయ్రంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచులో రన్‌వే కనిపించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక్కడికి రావాల్సిన పలు సర్వీసులను ఇతర నగరాలకు తరలించినట్లు అధికారులు…

హైదరాబాద్

ప్రజాప్రతినిధిని అలా ఈడ్చుకెళ్లడం దారుణం : దానం

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్‌రావుపై పోలీసులు ప్రవర్తించిన తీరు బాధా కరమని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. ఓ  ప్రజాప్రతినిధిని అలా ఈడ్చుకెళ్లడం దారుణమని వ్యాఖ్యానించారు. భూ వివాదం కేసులో పోలీసులు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని…

కరీంనగర్

నేడు నామినేషన్లు వేయనున్న స్వామిగౌడ్‌

కరీంనగర్‌: ఈరోజు టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ నేత స్వామిగౌడ్‌, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి సుధాకర్‌రెడ్డిలు నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌, ఉపనేత హరీష్‌రావు, ఎమ్మెల్యే కేటీఆర్‌…

జాతీయం

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 12 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జాతీయం

టెలికాంపై మంత్రుల సాధికారిక బృందం భేటీ నేడు

న్యూఢిల్లీ : టెలికాంపై ఏర్పాటైన మంత్రుల సాధికారిక బృందం నేడు భేటీ కానుంది ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రుల బృందం స్పెక్ట్రం వేలంలో ఎన్ని బ్లాక్‌లకు బిడ్డింగ్‌ వేయాలనే అంశంపై చర్చించనుంది.

ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌కు తరలింపు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి నిజామాబాద్‌కు ఈ ఉదయం పోలీసులు తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నేడు, రేపు అక్బరుద్దీన్‌ నిజామాబాద్‌ పోలీసులు విచారించనున్నారు.