Wednesday, 4 November 2026

February 2013

వార్తలు

గుజరాత్‌లో ఐపీఎన్‌ అధికారి అరెస్టు

అహ్మదాబాద్‌: ఇష్రత్‌ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో సీబీఐ అధికారులు గుజరాత్‌కు చెందిన ఐపీఎన్‌ అధికారి జీఎల్‌ సింఘాల్‌ను అరెస్టు చేశారు. 2004 జూన్‌లో ఇష్రత్‌ జహాన్‌ అనే యువతితో పాటు మరో ముగ్గురు యువకులు అహ్మదాబాద్‌ శివారులో…

జాతీయం

ఒత్తిళ్లు ఉన్నా పోరాటం కొనసాగిస్తాం : టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ : తమ పై ఒత్తిళ్లు ఉన్నా తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంటు సెంట్రల్‌ హాలులో అందరికీ అర్థమయ్యేలా నినాదాలు చేశామన్నారు. గుర్ఖాల్యాండ్‌తో తెలంగాణకు పొంతనలేదని వారు పేర్కొన్నారు.

హైదరాబాద్

ప్రయాణాలు వాయిదా వేసుకుని సడక్‌బంద్‌కు సహకరించండి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనందునే సడక్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌ కోదండరాం తెలిపారు. రేపు కొత్తూరు నుంచి అలంపూర్‌ వరకు భాజపా సడక్‌బంద్‌ ప్రచార యాత్ర ఉంటుందని అందరూ ప్రయాణాలే వాయిదా…

జాతీయం

నోయిడా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 65 మంది అరెస్టు

న్యూఢిల్లీ : ట్రేడ్‌ యూనియన్ల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మొదటిరోజు నొయిడాలో జరిగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయాల మీద రాళ్లు రువ్వడం, 25 వాహనాలను తగలబెట్టడం తదితర ఘటనలకు వీరు…

హైదరాబాద్

పొన్నాల కేసు విచారణ 27కి వాయిదా

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కేసు విచారణను హైకోర్టు ఈనెల 27కి వాయిదా వేసింది. పొన్నాల ఎన్నికల చెల్లదంటూ దాఖలైన కేసులో హైకోర్టు ఇప్పటికే మంత్రి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్

కిరణ్‌కుమార్‌రెడ్డితో జానారెడ్డి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

జాతీయం

ఆస్తుల అటాచ్‌మెంట్‌పై విచారణ మార్చి 18న

ఢిల్లీ : రాంకీ, జగతి పబ్లికేషన్‌స కేసులో ఈడీ నోటీసుపై న్యాయప్రాధికార సంస్థ మార్చి 18న విచారణ జరపనుంది. రాంకీ, జగతి కేసులో రూ. 143.7 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌ చేస్తూ జనవరి 7న ఈడీ నోటీసు జారీ…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,450.22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,160. కిలో వెండి…

జాతీయం

ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ ప్లూ మరణాలు

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 510 మందికి  స్వైన్‌ప్లూ పరీక్షలు పాజిటివ్‌ వచ్చాయి. పుణెలో రెండు సీరియన్‌ కేసులు, ఒక మరణం…

జాతీయం

రెండోరోజుకు చేరిన సార్వత్రిక సమ్మె : ఏటీఎంలలో డబ్బుల్లేవ్‌!

ఢిల్లీ : సార్వత్రిక సమ్మె రెండో రోజుకు చేరడంతో ప్రజల ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలోనూ బ్యాంకులు పనిచేయకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోని ఏటీఎంలలో చాలా చోట్ల డబ్బులు లేక ప్రజలు…