Thursday, 5 November 2026

February 2013

జాతీయం

రాహుల్‌తో ముగిసిన కాంగ్రెస్‌ నేతల సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. సమావేశం అనంతరం బోత్స విలేకరులతో…

ఆదిలాబాద్

కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌: కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలునుంచి అక్బరుద్దీన్‌ విడుదల కానున్నారు. దీంతో జైలు వద్దకు ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

జాతీయం

హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తుపై ఇటలీ వెళ్లనున్న అధికారుల బృందం

ఢిల్లీ: హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు కోసం రక్షణశాఖ, సీబీఐ అధికారుల బృందం రేపు ఇటలీ వెళ్లనుంది. ఇటలీ న్యాయవాదుల నుంచి ఈ  బృందం వివరాలు సేకరించనుంది.

హైదరాబాద్

చమురు ధరలు పెంపుపై సీపీఎం ధర్నా

హైదరాబాద్‌: ప్రభుత్వం చమురు ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. ఇవాళ ఆయన ఆధ్వర్యంలో సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టి బోమ్మ దహనం చేశారు.…

జాతీయం

కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కడుపునొప్పొ లేవడంతో చికిత్స నిమిత్తం  ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం…

ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌ విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: అక్బరుద్దీన్‌ పాస్‌పోర్టును న్యాయవాదులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయన విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: ఈరోజు నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,200గా ఉంది. కిలో వెండి…

హైదరాబాద్

సహకార ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదు వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణ వాదం లేదనేవారు సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తెరాస నేత వినోద్‌ సవాల్‌ విసిరారు. సహకార ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపును తెలంగాణవాదంతో ముడిపెట్టడం సరికాదని ఆయన విమర్శించారు.

ఆదిలాబాద్

అక్బర్‌ విడుదలపై వెలువడని ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు కావడంతో నిర్మల్‌ కోర్టులో రూ. 25 వేల చొప్పున రెండు వూచీకత్తులను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తరపు న్యాయవాదులు సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అక్బర్‌ పాస్‌పోర్టును…

హైదరాబాద్

ఎల్బీనగర్‌ జనంపైకి దూసుకెళ్లిన లారీ…ఒకరు మృతి

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో లారీ అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.