Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా సహకార సంఘం ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండావూపింది. డీసీసీబీ ఎన్నికల నిర్వహణపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌, జస్టిన్‌ అఫ్జల్‌ వి పుర్కర్‌తో కూడిన ధర్మాసనం కోట్టివేసింది.

వార్తలు

పాక్‌ సైనికుడిని కాల్చిచంపిన భారత సైన్యం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ దాటి వచ్చిన పాక్‌ సైనికుడిన భారత సైన్యం కాల్చి చంపింది. పాక్‌ విజ్ఞప్తి మేరకు మృత దేహాన్ని ఆ దేశానికి అప్పగించడానికి సైన్యం అంగీకరించింది.

హైదరాబాద్

రేపు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు రేపు కేకే నివాసంలో సమావేశం అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణతోపాటు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలు చర్చించనున్నారు.

హైదరాబాద్

నాంపల్లి కామత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: నాంపల్లి కామత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఖమ్మం

పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరి మృతి

ఖమ్మం : కొత్తగూడెంలో పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బొగ్గు ఉత్పత్తి పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సింగరేణి రెస్క్యూటీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

హైదరాబాద్

నిజాం షుగర్స్‌ ప్రైవేటీకరణపై సీబీఐచే దర్యాప్తు చేయించాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌: నిజాం షుగర్స్‌ ప్రైవేటీకరణపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెరాస నేత కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని ప్రవేటీకరించడం కుంభకోణమేనని సభాసంఘమే తేల్చి చెప్పిందని ఆయన అన్నారు. రూ. 2 వేల కోట్ల ఇంధన నర్‌ఛార్జీ…

కరీంనగర్

మంత్రి పొన్నాలకు తప్పిన ప్రమాదం

కరీంనగర్‌: ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంత్రి పొన్నాలకు ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్ట్‌ కూలింది. లిఫ్ట్‌ నుంచి పొన్నాలను సిబ్బంది బయటకు తీశారు…

హైదరాబాద్

చెత్తకుప్పలో తుపాకులు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లోని చెత్తకుప్పలో రెండు తుపాకులుదొరకడం కలకలం సృష్టించింది. గాంధీ ఆసుపత్రి వెనకభాగంలో ఉన్న చెత్తకుప్పలో తుపాకులు కన్పించాయని చెత్త ఏరేవారు పోలీసులకు సమాచారమందించారు. చిలకలగూడపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు 303 తుపాకులతోపాటు 20 తుటాలను…

జాతీయం

2జీ వేలంలో పాల్గొనని సంస్థలు కార్యకలాపాలు నిలిపివేయాలి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : లైసెన్సులు రద్దయిన, కొత్తగా 2 జీ వేలంలో పాల్గొనని టెలికాం సంస్థలు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైసెన్సుల రద్దు తర్వాత కార్యకలాపాలు సాగించిన సంస్థలు కొత్తవేలంలో నిర్ణయించిన ధర  చెల్లించాలని మార్గదర్శాకాలు జారీ…