Tuesday, 3 November 2026

March 2013

జిల్లా వార్తలు

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు.

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తితో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని మంత్రి వరంగల్‌లో వెల్లడించారు.

వరంగల్

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం : మంత్రి సారయ్య

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తి తో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని మంత్రి సారయ్య వరంగల్‌లో వెల్లడించారు.

హైదరాబాద్

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ బారీగా పెరిగింది. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయన్న ఆందోళనతో కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు.

జిల్లా వార్తలు

సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ

వరంగల్‌ : సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ కల్పిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు.

జిల్లా వార్తలు

గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా ‘క్రిస్తు కోసం సోదరుల్లు పరుగు’

వరంగల్‌: గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా వరంగల్‌ నగరంలో క్రైస్తవ సోదరులు ‘క్రీస్తు కోసం పరుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఖాజీపేట మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి సుబేదారి చర్చి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు…

మెదక్

మెదక్‌ డీఆర్‌సీ సమావేశం రసాభాస

మెదక్‌ : సంగారెడ్డి కలెక్టరేట్‌ లో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారింది. వివిధ పథకాల కేటాయింపుపై ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ,ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే నేతల పరస్పర దూషణలకు దిగారు.

కరీంనగర్

రూ. 10 లక్షల టేకు కలప స్వాధీనం

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ టేకు కలపను లారీలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. టేకు కలప సుమారు రూ.…

జిల్లా వార్తలు

విద్యుత్‌ ఛార్జీల తెదేపా మహిళా నేతల దీక్ష

నర్సంపేట: విద్యుత్‌ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని తెదేపా నేతలు చేపట్టిన దీక్షలను మద్దతుగా నర్సంపేటలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కరెంటు బిల్లులను ఈ సందర్భంగా దహనం చేశారు.

హైదరాబాద్

ఆ కళాశాలలకు రియెంబర్స్‌మెంట్‌ వర్తించదు: ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌ ,పార్మా కళాశాలల ఫీజు ప్రతిపాదనలను వెంటనే ఏఎఫ్‌ఆర్సీకి ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేయాలని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. పెంచిన ఐదు రోజుల గడువు నేటితో ముగుస్తోందని ఆయన గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లో ఫీజు ప్రతిపాదనలను…

జిల్లా వార్తలు

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

డోర్నకల్‌: డోర్నకల్‌లో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానికి ఎన్టీఆర్‌ విగ్రహానికి మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి బాబు పూలమాలలు వేశారు. పట్టణ అధ్యక్షుడు వెంకన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా…