Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

జిల్లాలో ప్రవేశించిన సీపీఎం జీపుజాత

అల్లంపూర్‌: ఫిబ్రవరి 24న ప్రారంభమైన అఖిల భారత సంఘర్ష్‌ సందేష్‌ జీపుజాత నాలుగు రాష్ట్రాల మీదుగా నేడు మహబూబ్‌నగర్‌ జిల్లా అల్లంపూర్‌ చౌరస్తాకు చేరుకుంది. ఈ జీపుజాతాలో పాల్గొన్న సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రామచంద్రన్‌ పిళ్లే, వరద…

జాతీయం

మక్మూల్‌కు రిమాండ్‌ : తీహార్‌ జైలుకు తరలింపు

న్యూఢిల్లీ : ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది మక్బూల్‌ను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఈ నెల 13 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో మక్బూల్‌ను తీహార్‌ జైలుకు తరలించారు. మక్బూల్‌పై గతంలో దాఖలైన కేసులకు…

ఖమ్మం

క్రేన్‌ కింద పడి వ్యక్తి మృతి

ఖమ్యం గ్రామీణం: మండలంలోని నాయుడు పేటసమీపంలో బైపాస్‌ రోడ్డు దాటుతుండగా క్రేన్‌ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎం వెంకటాయ పాలేనికి చెందిన తుపాకుల వెంకన్న (26) కూలి…

ఖమ్మం

పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటిన్నరతో నిర్మించిన నూతన భవన నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బాపురెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక…

ఖమ్మం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్ల పట్టివేత

బూర్గంపాడు: మండలంలోని ఇబ్రహింపేటలో గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఓ జేసీబీని కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రా వేళ ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు సమాచారం…

ఆదిలాబాద్

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…

ఆదిలాబాద్

అగ్నిప్రమాదంలో మహిళ మృతి

బైంసా: పట్టణంలోని బట్టిగల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మహిళ మృతి చెందారు. బటిగలిలోని అష్వాక్‌, జరీనాభాను తమ కుమారుడితో కలిసి ఇంటో ఉండగా విద్యుత్తు లేకపోవడంతో క్యాండిల్‌ వెలిగించుకున్నారు. రాత్రి 2గంటల సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో…

కరీంనగర్

పనులు కల్పించండి

వెల్దుర్తి :ఉపాధి పనులు కల్పించాలంటూ వెల్దుర్తికి చెందిన కూలీలు ఈఓఆర్డీ విజయభాస్కరరావుకు వినతి పత్రం అందజేశారు. చెరువులో కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టాలని వారు కోరారు.

కరీంనగర్

కళాశాలకు తాళంకళాశాలకు తాళం

వెల్దుర్తి: విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లు అందజేయాలంటూ వెల్దుర్తి జూనియర్‌ కళాశాలకు ఏఐఎన్‌ఎఫ్‌ నాయకులు తాళం వేసి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగటా కళాశాల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎన్‌ఎఫ్‌ నాయకులు కృష్ణ,…

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలవరకు వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీ హత్య వ్యవహారంపై సభ్యుల ఆందోళన ఈరోజు ఉదయం నుంచి సభా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తూ వచ్చింది.  దాంతో సభాపతి…