Friday, 6 November 2026

April 2013

జిల్లా వార్తలు

నష్టంపరిహారం చెల్లించకుంటే సీఎం సభను అడ్డుకుంటాం

నవీపేట గ్రామీణం: జిల్లాలో వడగళ్ల వానకు దెబ్బతిన్న వరికి నష్టపరిహారం చెల్లించాలని లేదంటే ఈనెల జిల్లాలో సీఎం నిర్వహించే సభను అడ్డుకుంటామని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. నవీపేటలో దెబ్బతిన్న రైతుల పంటపొలాలను ఈరోజు పరిశీలించారు.…

జాతీయం

గాయకుడు పీబి శ్రీనివాస్‌ కన్నుమూత

చైన్నై : దక్షిణాది నిసీ పరిశ్రమ యావత్తు చిన్నబోయింది. ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్‌ ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. శ్రీనివాస్‌ పూర్తి…

ఆదిలాబాద్

ఆట్టుకున్న చిన్నారుల నృత్యాలు

బెల్లంపల్లి: పట్టణంలోని మాతృ విద్యామందిర్‌లో 12వ వార్షికోత్సవాన్ని ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకంతో ఇచ్చిన ప్రదర్శన విశేషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ తదితరులు…

జిల్లా వార్తలు

చలివేంద్రం ఏర్పాటు

దంతాలపల్లి: మండలంలోని పడమటిగూడెం గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఏర్పాటు చేసే చలివేంద్రాల ద్వారా ప్రజలకు వేసవిలో దహార్తిని తీరుస్తున్నామనే సంతృప్తి తమకుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

హైదరాబాద్

కేకేతో కేసీఆర్‌ బేటీ

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ,రాజ్యసభ మాజీ సభ్యుడు కే.కేశవరావు భేటీ అయ్యారు. వారి సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది.

కరీంనగర్

ట్రాక్టరు టైరు పేలి డ్రైవరు మృతి

కోహెడ: కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం ట్రాక్టర్‌ టైరు మారుస్తుండగా అది పేలడంతో డ్రైవరు ఉప్పరపల్లి రవి (30) తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను తిమ్మాపూర్‌ మండలం పోలంపల్లికి చెందిన వ్యక్తి

ఆదిలాబాద్

పదిరోజుల్లో మంచిర్యాలకు గోదావరి నీరు

గరిమిళ్ల: మంచిర్యాల పట్టణానికి తాగునీటికోసం రూ.48 లక్షల మారుమూల గ్రామాల అభివృద్ధి నిధులతో ముల్కల్లా దగ్గర గోదావరి నదిలో జరుగుతున్న పనులను మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి పరిశీలించారు. మరో పదిరోజుల్లో ఈ పనులు పూర్తికానున్నాయని దీంతో పట్టణ ప్రజలకు…

హైదరాబాద్

అదుపు తప్పిన లారీ : ఒకరు మృతి

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లో ఓ లారీ అదుపు తప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పలువురికి గాయలయ్యాయి. 4 బైక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తకలించారు. లారీ డ్రైవర్‌ను…

ఆదిలాబాద్

పంచముఖి హనుమాన్‌ దేవాలయంలో హోమం

బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్‌, పట్టణంలోని పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ భక్తుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

సైదాపూర్‌లో మహిళ దారుణ హత్య

మెదక్‌ : కొండాపూర్‌ మండలం సైదాపూర్‌లో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.