Tuesday, 3 November 2026

April 2013

జిల్లా వార్తలు

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి కేసు నమోదు చేసిన పోలీసులు

చిన్నచింతకుంట: మండలంలోని వడ్డెమాన్‌ సమీపంలో వూకశెట్టివాగులో విమలమ్మ (40) అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు నరవ మండలం ఎక్లాస్‌పూర్‌కు చెందింన వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ఇటిక్యాల : మండలంలోని సాతర్ల గ్రామంలో ఈ తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. గుడిసెపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో పద్మమ్మ (35) అనే మహిళ మృతి చెందింది.

ఖమ్మం

కలెక్టరేట్‌ వద్ద భాజపా దీక్షలు

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహా రదీక్షలు మూడోరోజుకు  చేరుకున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా…

హైదరాబాద్

పేద విద్యార్థులకు కిరణ్‌ సర్కార్‌ షాక్‌

హైదరాబాద్‌ : పేద విద్యార్థులకు కిరణ్‌కుమార్‌ సర్కార్‌ షాక్‌ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1284 పాఠశాలలను మూసివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో సర్కార్‌ ఈ చర్యకు పాల్పడుతోంది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమిక విద్యాశాఖమంత్రి శైలజానాథ్‌…

వార్తలు

9కి పెరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య

రైల్యేకోడూరు : వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రైల్యేకోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో లారీ, ఇన్నోవా వాహనం ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు…

హైదరాబాద్

రాజన్నకు విజయమ్మ నివాళులు

హైదరాబాద్‌ : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఘనంగా నివాశులు అర్పించారు కరెంట్‌ సత్యాగ్రహానికి బయల్దేరిన ఆమె మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పంజాగుట్ట చేరుకున్నారు.…

ఖమ్మం

విద్యార్థులకిచ్చే బస్సు పాస్‌ ఛార్జీల పెంపు యోచనను విరమించకోవాలి

ఖమ్మం సంక్షేమం: విద్యార్థులకిచ్చే బస్సుపాస్‌ ఛార్జీల పెంపు యోచనను విరమించుకోవాలని పీడీఎన్‌యూ ఆధ్వర్యంలో బస్‌ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎన్‌యూ జిల్లా కార్యదర్శి ప్రదీప్‌ మాట్లాడుతూ ఇప్పటికే వివిధ రకాల భారాలను ప్రజలపై మోపిన…

హైదరాబాద్

5 లక్షల ఇళ్లలో టీవీలు బంద్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో సోమవారం బుల్లితెర వినోదానకి తెరపడింది. సెట్‌ టాప్‌ బాక్స్‌లు లేకపోవడంతో అనలాగ్‌ సంకేతాలు నిలిచిపోయాయి. కేబుల్‌ టీవీ రంగాన్ని డిజిటైజేషన్‌ చేయడంలో భాగంగా హైదరాబాద్‌, విశాఖ నగరాల్లో సెట్‌టాప్‌…

ఆదిలాబాద్

చెరువులో పడి బాలుని మృతి

కుంటాల: మండలంలోని అందాకూర్‌ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి సాయిప్రసాద్‌ (8) అనే బాలుడు మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం చెరువు సమీపంలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టి ఈ…

ఆదిలాబాద్

పెళ్లి కోసం దాచిన నగలు సిలిండర్‌ పేలి నగదు దగ్ధం

ఆదిలాబాద్‌: పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్‌ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓఇంట్లో దాచిన పెళ్లి కోసం దాచిన నగలు, నగదు అగ్నికి ఆహూతయ్యాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చిన బాధితులు.. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని…