Monday, 2 November 2026

April 2013

జిల్లా వార్తలు

నేడు ఆలేరుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

ఆలేరు: రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ ఈ రోజు ఆలేరుకు రానున్నారు. పట్టణానికి మంజూరైన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఆయన ఈ సాయంత్రం ప్రారంభించనున్నారు. అంతకుముందు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ ఆలయాన్ని…

జిల్లా వార్తలు

అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

దేవరకొండ: మండల పరిధిలో ఒక రైతు అప్పుల బాధ భరించలేక సోమవారం క్రిమి సంహార మందు తాగి మృతి చెందాడు. పడమటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లారెడ్డి బావి గ్రామానికి చెందిన లాలయ్యకు మూడెకరాల పొలం ఉంది. వేసవి…

వరంగల్

కాజీపేటలో సీఎం దీష్టిబొమ్మ దగ్ధం

వరంగల్‌ : కరెంట్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుకు నిరసనగా ఇవాళ కాజీపేటలోతెలంగాణ వాదులు సీఎం కిరణ్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్

గవర్నర్‌ను కలిసిన టీడీపి ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌ : గవర్నర్‌ నరసింహన్‌ను ఇవాళ రాజ్‌భవన్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. కరెంట్‌ ఛార్జీల పెంపు విషయంలో జోక్యం చేసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు.

ఖమ్మం

కలెక్టరు కార్యాలయం ఎదుట వామపక్ష ,భాజపాల ఆందోళన దీక్షలు

ఖమ్మం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష, భాజపాలు జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ సర్‌ఛార్జీల పేరిట రూ. 3వేల భారం మోపిన ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను…

సీమాంధ్ర

సీఎం కిరణ్‌తో మంత్రి పితాని భేటీ

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి పితాని సత్యనారాయణ ఇవాళ ఉదయం కలికిరిలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం సీఎం కిరణ్‌ నెల్లూరు జిల్లా ఇందిరమ్మబాటకు వెళ్లనున్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో స్పీకర్‌ పర్యటన ప్రారంభం

ఖమ్మం పట్టణం: అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, శాసనసభ ఎస్టీ కమిటీ సభ్యులు ఖమ్మం నుంచి కొత్తగూడెం, మణుగూరుల్లో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి ఖమ్మంలోని ఆర్‌ అండ్‌బి అతిధిగృహంలో బస చేసిన స్పీకరు బృందంతో సోమవారం ఉదయం మంత్రి…

హైదరాబాద్

వాళ్ల ఉద్యమాన్ని నేనేమి అనలేదు: సోమిరెడ్డి

హైదరాబాద్‌:వామపక్షాలు గతంలో చేసిన విద్యుత్తు ఉద్యమంలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మనుషులు చొరబడ్డారని తాము భావిస్తున్నామని, ఆ విషయాన్ని మాత్రమే తాను చెప్పానని తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కోన్నారు.వైఎస్‌ మనుషులు చోరబడి ఉద్యమిన్ని…

ఖమ్మం

విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం

చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరులో విద్యుదాఘాతంతో తోటకూరి వెంకటేశ్వర్లకు చెందిన 12 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. రూ. 50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.

ఖమ్మం

ఆటో ఢీకొన్ని రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.