Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

ఆర్టీసి ఎంప్లాయిన్‌ యూనియన్‌, టీఎంయూ సమ్మె నోటీసు

హైదరాబాద్‌ : ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్‌ , టీఎంయూ సమ్మె నోటీస్‌ ఇచ్చాయి. జూన్‌ 10లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. అర్టీసీలో ఒప్పంద కార్మికుల క్రమబదీకరణ, వేతన సవరణకు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఖమ్మం

పాల్వంచ కేటీపీఎస్‌ సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీమాంధ్ర

జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో వోటంబేడు యువత ప్రతిభ

తడ (నెల్లూరు) : ఇండియన్‌ సిలంబం ఫెడరేషన్‌ తొమ్మిదో జాతీయ ఛాంపియన్‌షిన్‌ కర్రసాము పోటీల్లో మండలంలోని కోటంబేడు యువత ప్రతిభను చాటారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు తమిళనాడులోని అవడిలో జరిగిన కర్రసాము పోటీల్లో…

తెలంగాణ

టీడీపీ మహానాడుకు హాజరైన హరికృష్ణ

హైదరాబాద్‌, జనంసాక్షి: గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఉదయం గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ గండిపేట మహానాడు ప్రాంగణానికి…

తెలంగాణ

మంత్రాలు చేస్తున్నారని దంపతులపై దాడి చేసిన స్థానికులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సంజయ్‌ బస్తీలో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో దంపతులపై స్థానికులు ఉదయం దాడి చేశారు. దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

పీలేరుకు చేరుకున్న ముఖ్యమంత్రి

చిత్తూరు : జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరుకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో పీలేరుకు వచ్చిన ముఖ్యమంత్రికి స్థానిక నేతలు స్వాగతం పలికారు. అనంతరం సీఎం అదికారులతో సమావేశమయ్యారు.

తెలంగాణ

టీజేఏసీ బయ్యారం యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర పేరుతో బయ్యారానికి ప్రచారయాత్రను జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. సీఎం కిరణ్‌ బయ్యారం ఉక్కు విషయంలో అహంకారంతో మాట్లాడుతున్నాడని అన్నారు. బయ్యారంపై ఇచ్చిన జీవోలు తక్షణమే రద్దు చేయాలని ఆయన…

తెలంగాణ

కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎన్‌ సేవలను

విస్తరిస్తాం -మంత్రి కోట్ల రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌, పెద్దషాపూర్‌ రైల్వేస్టేషన్లను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

తెలంగాణ

మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు మహానాడులోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో సంతకం చేశారు.