Friday, 6 November 2026

May 2013

సీమాంధ్ర

తిరుమల మొదటిఘాట్‌లో చెట్టును ఢీకొట్టిన జీప్‌

తిరుపతి, జనంసాక్షి: తిరుమల మొదటిఘాట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయస్వామి గుడి వద్ద ఒక జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించింది.

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌, జనంసాక్షి: కోహీర్‌ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

సిలిండర్‌ పేలి మహిళ మృతి

వనపరి : గ్యాస్‌ సిలిండర్‌ పేలిఓ మహిళ మృతి చెందిన సంఘటన వనపర్తి మండలంలోని కడకుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. శివమ్మ(26) అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమె…

సీమాంధ్ర

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం

తిరుమల, జనంసాక్షి: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని వినాయకస్వామి గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వస్తున్న ఓ వాహనం కొండను ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలిసులు క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

జాతీయ రహదారిపై రాస్తారోకో

వాజేడు (ఖమ్మం): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా నిర్మించిన మరుగు దొడ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ లబ్దిదారులు జాతీయ రహదారిపై జగన్నాథపురం వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

తెలంగాణ

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు

వరంగల్‌, జనంసాక్షి: హన్మకొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. హన్మకొండ కూడలిలో నిబంధనలు ఉల్లగించి నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు కూల్చివేశారు. అనుమతి లేకుండా కమర్షియల్‌ భవనం కట్టడంతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

స్పొర్ట్స్

బంగారం కొనడమంటే ఇష్టం:

  సచిన్‌ హైదరాబాద్‌: అక్షయ తృతీయ సందర్బంగా వాల్యూ మార్ట్‌ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్‌ క్రికెటర్ల ముఖాలు సంతకాలతో కూడిన సచిన్‌ టెండుల్కర్‌ బంగారు నాణేలను పరిమితమైన సంఖ్యలో ఆ సంస్థ విడుదల చేసింది. వాల్యూ…

స్పొర్ట్స్

కిస్‌గేల్‌ మనసులోని మాట

బెంగళూర్‌: ప్రత్యర్థి బౌరల్లకు చుక్కలు చూపించే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ తన మనసులోని మాట చెప్పాడు. ప్రత్యర్థి బౌరల్లను చితకబాదుతున్నప్పుడు తనకు తెగ ఆనందం వేస్తుందని, అయితే అదే స్థాయిలో అవతలి బ్యాట్స్‌మెన్‌ చెలరేగితే బాధ…

జాతీయం

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 25 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.