Tuesday, 3 November 2026

June 2013

తెలంగాణ

తెలంగాణ సాధనలో ఇదే ఆఖరి పోరాటం: పొన్నాల

మెదక్‌ : తెలంగాణ సాధనలో ఇదే ఆఖరి పోరాటమని మంత్రి పొన్నాల లక్ష్యయ్య స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లా వర్గల్‌ మంత్రి మీడియాతో మాట్లాడారు. సాధన సభతో అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పారు. త్వరలోనే…

తెలంగాణ

ఓయూ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ఓయూ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వేదికగా మారేందుకు విద్యార్థి నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

అంతర్జాతీయం

సహాయక చర్యల్లో పాల్గొంటున్న 300 మందికిపైగా తెలుగువారు

డెహ్రాడూన్‌ : బద్రీనాథ్‌ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితుల్లో 300 మందికిపైగా తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. వీరిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న హైదరాబాద్‌ డీసీపీ తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు…

జాతీయం

నేడు ఏఐసీసీ సభ్యులతో భేటీ కానున్న రాహుల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కొత్తగా ఎంపికైన కార్యవర్గ సభ్యులతో ఈ రజు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, శాసనసభ లోక్‌సభ ఎన్నికల సమరంపై కార్యవర్గ సభ్యులకు రాహుల్‌ దిశానిర్ధేశం…

అంతర్జాతీయం

లభ్యం కాని 1800 మంది యాత్రికుల ఆచూకీ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 2 వేల మందికిపైగా యాత్రికుల తరలింపునకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 1800 మంది యాత్రికుల ఆచూకీ లభ్యం కానట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ

రద్దుయిన బీడీఎల్‌ రాత పరీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి):భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) టెక్నికల్‌ అసిస్టెంట్‌(మెకానిక్‌, ఎలక్ట్రానిక్స్‌), జూనియర్‌ టెక్నీషియల్‌ (ఫిట్టర్‌, వెల్డర్‌,హెల్పర్‌) పోస్టుల భర్తీ కోసం కంచన్‌బాగ్‌(హైదరాబాద్‌) బీపీడీఎవీ పాఠశాలలో 30న నిర్వహించనున్న రాతపరీక్షను రద్దు చేసినట్లు ఆ సంస్‌థ సీనియర్‌ మేనేజర్‌ రాజీవ్‌ సక్సేన ఒక…

సీమాంధ్ర

ట్రాక్టర్‌ ఢీ: ఇద్దరి మృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వెంకటనగరంలో ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. వృద్ధులు రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ

హత్య గురైన ఓ యువతి

రంగారెడ్డి : కోకాపేట సెజ్‌ వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి అనంతరం దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు ఉరుములతో కూడిన…

తెలంగాణ

ప్రమాదవశాత్తు ఎంబీబీఎన్‌ విద్యార్థి మృతి

నేరేడిగొండ : ఆదిలాబాద్‌ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఎంబీబీఎన్‌ విద్యార్థి మృతి చెందాడు. మృతున్ని నిర్మల్‌కు చెందిన మహ్మద్‌ అలీగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టారు.