Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

శాసన మండలి వ్యవహారాల సలహాసంఘం భేటీ

హైదరాబాద్‌ : శాసనమండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రాంభమైంది. బడ్జెట్‌ రెండో దఫా సమావేశాల అజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

తెలంగాణ

గోదావరిలో జాలర్లు గల్లంతు

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం పెరగింది. వాజేడు మండలం ఏజర్లపల్లికి చెందిన 30 మంది మత్స్యకారులు నిన్న చేపల వేటకు వెళ్లి గోదావరిలో చిక్కుకున్నారు. వీరిలో పదిహేను మందిని పోలీసులు…

సీమాంధ్ర

తెదేపానేత యనమలకు గాయాలు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తొండంగా మండలం పెరుమల్లాపురం దుర్గమ్మ అలయం వద్ద తెదేపా సీనియర్‌నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మెట్లపై నుంచి జారిపడ్డారు. కాలికి గాయం కావడంతో 3వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

తెలంగాణ

శ్రీనివాస్‌ మృతదేహాన్ని సందర్శించిన జేఏసీ ఛైర్మన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్‌ మృతదేహాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి సందర్శించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

జాతీయం

ఏసీబీ వలలో టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

విజయవాడ: విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన సీబీఐ జేడీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ ఇన్‌ఛార్జ్‌ జేడీగా అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు. ఇతను ప్రస్తుతం తమిళనాడు సీబీఐ జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకు ముందు జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ స్థానంలో అరునచలం ఇన్‌చార్జ్‌గా వచ్చారు.

తెలంగాణ

ఓయూలో తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు బండారు శ్రీనివాస్‌ అనే విద్యార్థి, గురూనానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమన్‌గల్‌ మండలం గౌడిపల్లి గ్రామానికి చెందిన ఇతను క్యాంపస్‌లో…

తెలంగాణ

నిమ్స్‌ డైరెకర్‌గా అజయ్‌ సహాని

హైదరాబాద్‌ : అరోగ్యశాఖ కార్యదర్శి అజయ్‌ సహానీకి నిమ్స్‌ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ నిమ్స్‌ డెరెక్టర్‌గా పనిచేసిన ధర్మరక్షక్‌ రాజీనామా చేశారు.

తెలంగాణ

హైదరాబాద్‌లో బంద్‌ పాక్షికం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ… తెరాస తల పెట్టిన బంద్‌ హైదరాబాద్‌లో పాక్షికంగా కనబడుతోంది. కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌ లోని కొన్ని ప్రాంతాల్లో షాపులు మూసివేశారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా యథాతథంగా…