Tuesday, 3 November 2026

June 2013

సీమాంధ్ర

చిన్న తల్కాపురంలో ఇద్దరు దారుణ హత్య

కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నతల్కాపురంలో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. కోడుమూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తున్న ఇద్దరిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో కోడూమూరుకు చెందిన వెంకటరాముడు, అంజనేయులు మృతిచెందారు.

జాతీయం

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ్ల లాభాలతో ప్రారంభమయ్యాయి. 180 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

జాతీయం

రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

చెన్నై: తమిళనాడులో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి నలుగురు, డీఎంకే నుంచి కనిమొళి, విజయ్‌కాంత్‌ పార్టీ నుంచి ఇళంగోవన్‌, సీపీఐ నుంచి డి.రాజా…

ఎడిట్ పేజీ

సంసంపాదకీయం

ఎవరిని మోసం చేద్దామని? ‘తెలంగాణ సాధన కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 30న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’ అని ఈ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర…

తెలంగాణ

చికిత్స పొందుతూ యువకుడి మృతి

నాచారం(హైదరాబాద్‌): తెలంగాణ కోసం పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సాయినాథ్‌ (22) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్లాపూర్‌కు చెందిన సాయినాథ్‌ బుధవారం ఉదయం పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి తీవ్రంగా…

తెలంగాణ

భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు నేడు

హైదరాబాద్‌: భాజపా ఆధ్వర్యంలో మధ్యాహ్నం సికింద్రాబాద్‌ సిక్‌విలేజ్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమ ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు, భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు హాజరుకానున్నారు.

అంతర్జాతీయం

6 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు

చెన్నై: తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి ఐదుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి కనిమొళి పోటీలో ఉన్నారు. విజయకాంత్‌ పార్టీ నుంచి…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ప్రకాశం : ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అంతర్జాతీయం

గోదావరికి పోటెత్తిన వరద

రాజమండ్రి: గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ధవళేశ్వరం నుంచి 1.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 28.1 అడులకు చేరింది.

సీమాంధ్ర

ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌

కడప: కడపలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాఘవేంద్రాచారి (26) బుధవారం అర్థరాత్రి కడప వన్‌టౌన్‌స్టేషన్‌ పరిధిలోని వీరాస్వామిమండి వీధిలో తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాఘవేంద్రాచారి 2009లో ఏఆర్‌…