Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

కోనేరు ప్రసాద్‌ పిటీషన్‌పై నిర్ణయం ఎల్లుండి

హైదరాబాద్‌,(జనంసాక్షి):దుబాయ్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్‌ నిందితుడు కోనేరు ప్రసాద్‌ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

జాతీయం

దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగమార్గం ప్రారంభం

శ్రీనగర్‌,(జనంసాక్షి): జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలు మార్గాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. రైలులో ఆ మార్గం గుండా ప్రధానితో సహా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయాణించారు. 18 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గంలో…

తెలంగాణ

మత్తు మందులు తయారుచేస్తున్న కంపెనీపై పోలీసుల దాడి

మెదక్‌జిల్లా: పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మత్తు మందులు తయారుచేస్తున్న కంపెనీపై పోలీసులు దాడిచేశారు. గత రెండు రోజులుగా దాడులు చేసి చెన్నై పోలీసులు నిందితులను నేడు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

తిరిగి జులై 4న ప్రజా పద్దుల సంఘం సమావేశం

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాలులో ఇవాళ సమావేశమైన ప్రజా పద్దుల సంఘం రెవెన్యూ అధికారులు పూర్తి సమాచారంతో రానందుకు వాయిదా పడింది. తిరిగి వచ్చే నెల 4న సమావేశం నిర్వహించాలని సంఘం నిర్ణయించింది.

తెలంగాణ

పటాన్‌చెరువులో ఫార్మా కంపెనీపై దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): పటాన్‌చెరువులో ఫార్మా కంపెనీపై పోలీసులు దాడి చేశారు. రూ. కోటి విలువైన ఎపిడ్రియల్‌ మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. విదేశాలకు సరఫరా చేయడానికి సిధ్దమౌతుండగా ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

తెలంగాణ

కోనేరు ప్రసాద్‌ పిటిషన్‌పై నిర్ణయం ఎల్లుండి

హైదరాబాద్‌ : దుబాయ్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్‌ నిందితుడు కోనేరు ప్రసాద్‌ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

తెలంగాణ

జాతీయపార్టీల నేతల ముగిసిన టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): జాతీయ పార్టీల నేతలతో తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ ఈ నెల 29న మాసబ్‌ట్యాంక్‌లో ప్రజాకోర్టు నిర్వహిస్తామని తెలిపారు. జులై 4,5 తేదీల్లో ఢిల్లీలో…

తెలంగాణ

ఈ నెల 29న మాసాబ్‌ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు కోదండరాం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఈ నెల 29న మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన జిల్లాల సాధన మాత్రమే తమ డిమాండ్‌ అని…

సీమాంధ్ర

తిరుమలలో తప్పిపోయిన బాలిక దొరికింది

చిత్తూరు జిల్లా : గత నెల తిరుమలలో తప్పిపోయిన ఐదేళ్ల చిన్నారి రోషిణి శేషాచలపురంలో కనిపించింది. రోషిణిని తిరుమల పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.